క్షమా గుణమే..! మనశ్శాంతికి మార్గం..!!:- కవిరత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
అయ్యో ! అయాం…సో సారి..!
ఓకే...చేయకండీ తప్పు...మరోసారి..!
చేస్తే ఎవర్నైనా క్షమించండి...ప్రతిసారి..!

ఏ తప్పు చేయని 
ఏ లోపం లేని మనిషి ఈ లోకంలో లేడు...
తప్పుని ఒప్పుకునే సాత్వీక చిత్తం
క్షమాగుణమున్నోళ్ళకే మనశ్శాంతిఫలాలు..!

క్రీస్తు నేర్పిన క్షమాగుణం...
బుద్ధుడు ప్రసాదించిన ప్రశాంతతే...
మనకు వరాలు...విజయానికి సోపానాలు
తప్పులు చేస్తే క్షమించే 
ప్రతి దయార్ద్రహృదయం దేవుని గుడియే..!

తప్పులు పునరావృతం కానివ్వనివారు 
తేజస్సుతో మెరిసిపోయే తీర్థులౌతారు...
వారింటా...బయట అడుగిడిన ప్రతిచోట
ఆదర్శాల అమృతధారలు...కురిపిస్తారు..!

పగ ఒక నిప్పు కణం...
ప్రతీకారం ఒక బాణం...
ఆ తలంపులతో నిండిన మది మలినమే
పరుల తప్పుల్ని నిత్యం జపించే జ్వలించే 
మనసు కసిగా తనను తానే... 
కాల్చుకుంటుంది...బలితీసుకుంటుంది..!

ఘోరాలు నేరాలు చేసినవారిని 
క్షమించడం ఒక దైవ గుణం...
అట్టి హృదయమొక విరితోట...
ఆ తోటలో ప్రశాంతత 
ఒక పుష్పమై విరబూస్తుంది...
ఆనందతాండవం చేస్తుంది...!

ఆ ఇల్లు...ఒక శాంతి మందిరమే...
ఆ మనసు...ఒక దయాసాగరమే...
ఆ జీవితం...ఓ ఆనంద నిలయమే...
ఆ బ్రతుకు...ఓ అందాల బృందావనమే..!

ఎండలో నీడలా వర్షంలో గొడుగులా
అవసరానికి అప్పు చేయనివాడు 
జీవితంలో ఏ తప్పు చేయనివాడు 
ఈ భూమిపై ఇంకా పుట్టనే లేదు..!

క్రీస్తు క్షమా గుణం...
బుద్ధుని ప్రశాంత చిత్తం...
ప్రతిమనిషి కోరేది ఈ రెండు వరాలే
అవి కోటివరాల కన్న మిన్న
అవి పరమాత్మ నుండి పొందితే
కూటికి లేకున్ననేమి వారు కోటీశ్వరులే...
దరిద్రులైననేమి వారు ధనవంతులే..!
 


కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం