ప్రజల వేదన,పోరాట ప్రేరణ:- ఎ. ఆర్. శ్రీకాంత్, వరంగల్
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు. 
================
వెలుగొస్తుంది చీకటిలో – విరిగిపోతుంది బంధంలో
గెలవాలి ప్రజల ఆశ – గర్జించాలి  జన సంద్రంలో
విప్లవాన్నే పునాది చేసి – కట్టుకుందాం ఊపిరిలో
నవజనాన్ని నడిపించేది – ఉద్యమాలే గాడిలో

నీతి లేకున్నా న్యాయం తోడే – పోరాటం ఓ బాధలో
గుడి గోపురం గర్జించదు – గళం మ్రోగాలి గాథలో
నీవే కావాలి నాయకుడిగా – పౌరుడిగా ప్రాణంలో
దూకిపోనీ దిక్కరాని – అన్యాయాల వానలో


కలమే. నీ ఆయుధం – కలకాలం ఓ భావంలో
పదమే నీ క్షిపణి అయి – పడిపోవాలి శత్రువులో
నిర్మాణమే నీ లక్ష్యంగా – నిత్య శ్రమికుడి క్షమలో
పద్యం కాదు ఈ కవిత్వం – ప్రజల కోప జ్వాలలో


నినాదమే నీ శక్తిగా – జనవాణిగా మారనీ
బానిసత్వం తుడిపెట్టే – రక్త గంధమై వీణనీ
రాళ్లపై రాసే భావాలు – ఉద్యమ రేకలై పాడనీ
దేహమైతే నీ గానమే – గుండె ధైర్యమే తాడనీ


ఉప్పెనలా ఊగిపడే – విప్లవ కెరటమై రా
గోడలు  కొలచే – కోపపు జ్వాలలై రా
భవిష్యత్తు పిలుస్తోంది – బతుకు బాటలో నడుచు రా
నువ్వు కదలాలి – నేల మగ్గాలి – ప్రజల గుండె లోతుల రా!


కామెంట్‌లు