పురాతన రోమ్‌లో, గైయస్ జూలియస్ సీజర్ ( Gaius Julius Caesar ) ప్రసిద్ధ జనరల్. రాజనీతిజ్ఞుడు. అందరికంటే ఈయనను ఎక్కువగా విశ్వసించేవారిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనెవరో కాదు, అతని వ్యక్తిగత వైద్యుడు. ఈ వ్యక్తి సీజర్ వైద్యుడు మాత్రమే కాదు, అత్యంత నమ్మకమైన స్నేహితుడు కూడా.
సీజర్ అనారోగ్యానికి గురైనప్పుడల్లా, అతను ఈ నమ్మకమైన సహచరుడి నుండి నేరుగా మందులు మాత్రమే తీసుకునేవాడు. అతను ఏం చెప్తే అది పాటించే వాడు.
ఒక రోజు, సీజర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతనికి ఒక లేఖ వచ్చింది. అది ఎవరు రాశారో తెలీదు. అది ఒక అనామక లేఖ.
“మీ దగ్గరి స్నేహితుడు, మీ వైద్యుడి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అతను మీకు విషం ఇవ్వాలనుకుంటున్నాడు!”
అన్నదే ఆ లేఖ సారాంశం.
ఈ ఉత్తరం గురించీ ఏమీ తెలీని వైద్యుడు ఎప్పట్లాగే చికిత్స చేయడానికి వచ్చాడు. అప్పుడు, సీజర్ ఏమీ మాట్లాడక తనకు కొద్దిసేపటి క్రితం వచ్చిన లేఖను ఆ వైద్యుడికి ఇచ్చాడు. అతని స్నేహితుడు, వైద్యుడు అయిన ఆ వ్యక్తి ఆ హెచ్చరిక లేఖ అందుకుని చదువుతుండగా, సీజర్ అతనిచ్చిన ఔషధంలోని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశాడు.
అది చూసి ఆశ్చర్యపోయిన వైద్యుడు ఒకింత భయపడి ఇలా అడిగాడు...
“ఓ నా ప్రభూ, ఈ హెచ్చరిక లేఖ చదివిన తర్వాత కూడా నేను మీకు ఇచ్చిన దానిని మీరు ఎలా తాగారు?”
అని.
దానికి జూలియస్ సీజర్ “స్నేహితుడిని అనుమానించడం కంటే చనిపోవడం మంచిది.” అని ఎంతో ప్రశాంత వదనంతో జవాబిచ్చాడు.
నమ్మకం మనం ఇవ్వగల అత్యున్నత బహుమతి. కొన్నిసార్లు, అత్యంత ధైర్యాన్నీ ఇస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి