కవితల పోటీల్లో తిరుమలరావుకు ప్రధమ బహుమతి

 పారఖండ్యాం ఎంపియుప పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రథమంగా నిలిచారు. విమల సాహితీ సమితి వారు అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీల్లో తిరుమలరావు పాల్గొని, కవిత పంపగా న్యాయనిర్ణేతలబృందం ప్రదమ స్థానానికి ఎంపిక చేసి ప్రశంసాపత్రం పంపారు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా చదువులమ్మ ఒడి సర్కారు బడి అను అంశంపై కవితల పోటీలను నిర్వహించగా తిరుమలరావు పంపిన ప్రకృతి ఒడి ప్రభుత్వ బడి అను కవిత ప్రథమ బహుమతికి ఎంపికైంది. 
విమల సాహితీ సమితి అధ్యక్షులు డా.జెల్ది విద్యాధర్ ఆధ్వర్యంలో, తరుమెళ్ళ కల్యాణి సమన్వయంతో పోటీలు నిర్వహించగా, శైలజామిత్ర న్యాయనిర్ణేతల బృందం తిరుమలరావును అభినందిస్తూ ప్రశంసాపత్రం పంపించారు.బాలలను ఉద్దేశించి సంపద ఎంత ఉన్నా, సమవయస్కులతో సహవాసమే మిన్న అని, దుమ్ము ధూళి బురదలయందు పొర్లి దొర్లుటే హాయి, అరిపులు కేకలు గొడవలలోనే పిల్లలకు అవి మిరాయిలని వారి స్వేచ్ఛాయుత బాల్యం గూర్చి రచించారు. బాలల హక్కుల పరిరక్షణకే తన పయనం, ప్రతిజ్ఞ దేశభక్తి సృజనాత్మకతలే తన కథనం అంటూ ప్రభుత్వ పాఠశాలల నేపధ్యాన్ని వివరించారు. గ్రఃథాలయ తరగతులు, పాఠ్యాంశాల్లో గల నైతిక విలువలు మున్నగు అంశాలు సర్కారు బడిలో సాధ్యమగునని తిరుమలరావు తన కవితలో స్పష్టపరిచారు. ప్రకృతి ఒడి ప్రభుత్వ బడి అను అంశంపై కవిత పంపి ప్రథమ బహుమతి సాధించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు