అరుణాక్షర కవితా తోరణాలు ' అరుణరాగాలు' అంతర్జాల కార్యక్రమం
  'అరుణోదయ 'సాహితీ వేదిక, అనుబంధ సంస్థల,' అరుణాక్షర కవితా తోరణాలు ( కవితలు ) ' అరుణరాగాలు' ( పాటలు )  కలిసి అంతర్జాలంగా జరిగిన  కార్యక్రమం మంగళవారం దిగ్విజయం గా ముగిసింది.
ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథి గా డా. నాళేశ్వరం శoకరం గారుప్రాఖ్యాతవక్త( OUప్రొఫెసర్) గారు,
సభాద్యక్షులుగా  డా. రామకృష్ణ చంద్రమౌళి గారు, సాహిత్యవేత్త,సలహాదారులు,విమర్శకులు, (సెయింట్ పాయెస్ వి్మెన్స్ డిగ్రీ అండ్ pG కాలేజ్ )ఆత్మీయ అతిథిగా   ఘంటా మనోహర్ రెడ్డిగారు సాహిత్య వేత్త, ప్రముఖ వక్త ( rtd. వాణిజ్య పన్నుల అధికారి )
 డా. కృష్ణారెడ్డి గారు సాహిత్య వేత్త, సమీక్షకులు, సమాజ సేవకులు ( rtd అధికారి)లు  మా ఆహ్వానం మేరకు విచ్చేసి 
ఎంతో సాహిత్య విజ్ఞాన విషయాలను,వచన కవిత మెలకువలు, శైలి, అంశం, ఎత్తుగడ, ముగింపు ఇలా వచన కవిత్వం  గురించి ప్రస్తావిస్తూ, కవులకు  వివరణ ఇచ్చారు.పాట ప్రాముఖ్యం, పాటలరకాలు, పాట ఏవిధంగా రక్తి కట్టి  ప్రేక్షకుల మదిని  దోచుకుంటుంది అనే  విషయాల మీద  చాలా  చక్కగా  ప్రసoగించారు.
దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో టైము కూడా  తెలవనంత ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోయింది,డా. నర్సింహశర్మగారి  సమ్మేళన నిర్వహణ, ముగింపు పలుకులతో సభ దిగ్విజయంగా  ముగిసింది.
 'అరుణోదయ ' అంతర్జాల కార్యక్రమంరానురాను   ఎంతో  ఉత్సహంగా ముందుకు  వెళ్తున్నందుకు  డా. రామకృష్ణ చంద్రమౌళి గారు సభాఅధ్యక్ష్యత నిర్వహిస్తూ  అభినందించడం సంతోషకరం.
డా. నాళేశ్వరంశంకరం గారు అరుణోదయ సాహితీ సంస్థ విజ్ఞాన దాయకంగా, అనేకమంది కవులు రాసే కవితలు  చాలా  బాగుంటున్నాయని, అరుణారాగాల్లో  పాటలు కూడా  వింటున్నానని, గాయనీ, గాయకులు  చక్కగా పా డుతున్నారని  ప్రశంసిoచారు.
ముందు  ముందు  ఏం  చేస్తే  బాగుంటుందో  కూడా  కొన్ని సలహాలు ఇవ్వడం ఆనందకర విషయం.
ఎంత  ఆనందంగా 4 గంటల పాటుస్నేహ పూర్విత వాతావరనం గా జరిగిన ఈ కార్యక్రమంలో  అనేక మంది కవులు, గాయనీ, గాయకులు  కవితాగానం, పాటలు  పాడి సభను  రక్తి కట్టించారు.
   ఇంత  విజవంతం చేసినందుకు  సమూహ అధ్యక్షు రాలు డా. అరుణ కోదాటి  అందరికీ  పేరు  పేరునాకృతజ్ఞతలు తెలిపింది.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం