దయామయుడు:- జంజం కోదండ రామయ్య-జమ్మిపాళెం
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
=============
సురాసురులు
మధించగా జలధిని
ఆవిర్భవించె మొదట
హాలాహలము..!

ప్రళయం ఉప్పొంగునని
శివుని ఆశ్రయించిరి అందరు
ప్రపంచం ఆగ్నికి ఆహుతౌతుందని శరణు కోరిరి..!!

ప్రమాదమని తెలుసుహాలాహలం
అయినా వారి ఆర్తనాధాలు విని
అంగీకరించెను పరమ శివుడు...!!

బైట వుంచిన ప్రళయం
మ్రింగిన కడుపులో వున్న లోకాలకు అనలం..!!

తన కంఠమందుంచుకున్న
పరమ దయామయుడు
మన దేవుడు...!!!


కామెంట్‌లు