చిలకల దుంప :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
చిలక పలుకుల పిల్లల్లారా
చిలకలదుంపను చూశారా 
చిన్నలు పెద్దలు తినవచ్చు 
చిన్నగా పెద్దగా ఉంటాయి 

అందులో పోషకాలు ఎన్నో 
షుగర్ వ్యాది ఉన్న వారికి
ఎంతో చక్కని ఔషధమండి 
తక్కువ చూపు చూడొద్దు 

దాన్ని సంతకు వెళ్ళి కొనండి 
శుభ్రంగా మీరు కడగండి 
కుండలో ఆ దుంపను పెట్టండి 
సన్నని సెగ మీద ఉంచండి

మంచిగ దుంపను ఉడికించి 
వేడివేడిగా అందరు తినండి
దానిలో రోగ నివారక శక్తి ఉంది 
ఆ దుంపలు తిని ఆరోగ్యంగా ఉండండి 


కామెంట్‌లు