రాయిని దైవంగా ఆరాధించండి
రక్షణనిస్తుంది అమ్మవారిగా
చెట్టుని ఆరాధించండి దైవం రూపేణా
అది చేయని మేలులేదు
పుట్టనూ కొలవండి పూజలుచేసి
అందుండేది విషపు నాగైనా
ప్రకృతి పరిరక్షణకు ఏదోవిధంగా
తోడ్పడుతుంది
పశువునారాధించండి
కమ్మనిపాలైనా ఇస్తుంది
పక్షినారాధించండి
పచ్చదనం పెంపొందేలా చెట్లు
మొలకలెత్తడానికి
సహకరిస్తుంది
భూమిపైగలిగినవన్నీ
ఇతోధికంగా ఇలకు అంతో యింతో
మేలుచేస్తున్నాయి
మరి మానవ వినాశనం కోరే
ప్రకృతిని పరిమార్చబూనే
కడుపులో కడివెడు విషం దాచగలిగిన
మనిషినెందుకు గడ్డిగాఆరాధిస్తున్నారు
మీ స్వార్థ ప్రయోజనాలకోసమేకదా
అర్థంలేని ఆరాధన
******
రాయిని దైవంగా ఆరాధించండి
రక్షణనిస్తుందది దైవంరూపణా
చెట్టుని ఆరాధించండి
అమ్మవారిగా
అది చేయని మేలులేదు
పుట్టనూ ఆరాధించండి పూజలుచేసి
అందుండేది విషపు నాగైనా
ప్రకృతి పరిరక్షణకు ఏదోవిధంగా
తోడ్పడుతుంది
పశువునారాధించండి
కమ్మనిపాలైనా ఇస్తుంది
పక్షినారాధించండి
పచ్చదనం పెంపొందేలా చెట్లు
మొలకలెత్తడానికి
సహకరిస్తుంది
భూమిపైగలిగిన వన్నీ
ఇతోధికంగా ఇలకు అంతో యింతో
మేలుచేస్తున్నాయి
మరి మానవ వినాశనం కోరే
ప్రకృతిని పరిమార్చబూనే
కడుపులో కడివెడు విషం దాచగలిగిన
మనిషినెందుకు గుడ్డిగాఆరాధిస్తున్నారు
మీ స్వార్థ ప్రయోజనాలకోసమే కదా
మీ ఒక్కరి ప్రయోజనం
కొరకూ పలు
బక్క జీవాలఉసురు పోసుకొనడం భావ్యమా
విౙులుగనుక మీరైతే వివేకంతో ఆలోచించండి
అధమాధములైన
మానవ మృగాల
ఆరాధన మానండి
మూర్ఖుడిని ఆరాధించడం అంటే
ముప్పును కొనితెచ్చుకోవడమే
అగ్గిని కొంగుకు కట్టుకొని తరగడమే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి