మనిషికి ఆరోగ్యం -శాస్త్రం -చాలా ముఖ్యం. మనసుకు అంతే ముఖ్యమైంది సాహిత్యం. సమాజానికి కావాల్సింది ఆరోగ్యకరమైన ఆలోచనలు-మరియు శాస్త్రీయ ఆలోచనలు. ప్రస్తుతం శాస్త్రానికి సాహిత్యానికి సానుకూల ఆలోచనలే ముఖ్యం. నిర్మాణాత్మకమైన ఆలోచనలే సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. శాస్త్రం సాహిత్యం ఇక ఏమీ సహాయం చేయలేదనుకుంటే ఆధ్యాత్మికమే ఆ సమస్యను పరిష్కరిస్తూ మనిషికి మార్గాన్ని మనశ్శాంతిని ఇస్తుంది. తత్వశాస్త్రంలోంచి పుట్టిన మొట్టమొదటి శాస్త్రం భౌతిక శాస్త్రం దాన్ని అధ్యయనం చేసి సమ సమాజానికి కొత్త ఆలోచనలు పంచుతున్న అరుణ్ కుమార్ శూన్యం కవిత్వం-తత్వం సాహిత్యం శాస్త్రం ల కలయిక. దాంట్లో మనసు మేధస్సు కలిసి కనిపిస్తాయి. అందుకే దాన్ని గొప్పగా అభినందిద్దాం.
డా ప్రతాప్ కౌటిళ్యా.
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి