కవితావిస్ఫోటాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితాజల్లులు
కురిపిస్తా
కవితాస్నానాలు
చేయిస్తా

కవితాకుసుమాలు
పూయిస్తా
కవితాసౌరభాలు
వ్యాపిస్తా

కవితాచిందులు
త్రొక్కిస్తా
కవితానందము
కలిగిస్తా

కవితామాధుర్యాలు
తినిపిస్తా
కవితామృతము
త్రాగిస్తా

కవితాసేద్యము
సాగిస్తా
కవితాపంటలు
పండిస్తా

కవితాసవ్వడులు
కావిస్తా
కవితాగానాలు
వినిపిస్తా

కవితాప్రవాహము
కొనసాగిస్తా
కవితాసాగరమందు
కలిపేస్తా

కవితాదీపాలు
వెలిగిస్తా
కవితాకాంతులు
వెదజల్లుతా

కవితావెన్నెలను
ప్రసరిస్తా
కవితావిహారము
చేయించుతా

కవితాపయనము
చేయిస్తా
కవితాలోకమును
చేర్పిస్తా

కవితలందు
ముంచుతా
కవనాలందు
తేలుస్తా

కైతలందు
కనిపిస్తా
కయితలందు
కట్టేస్తా


కామెంట్‌లు