ఆ రోగం నయమవ్వలేదంటే
సరియైన మూలిక దొరకలేదేమో!!?
ఆకలిని పగలగొట్టే వాళ్లే బండరాళ్ళను పగలగొడతారు.
చెమటతో అభ్యంగన స్నానమాడినట్లు
చెట్లు నీళ్ళాడుతున్నవీ!!
నిప్పును కప్పుకున్న ఆకాశం నీళ్లతో ఎప్పటికీ స్నానం చేయదు.
ఎండిపోయిన గుండెను తుపాకీ గుండ్లు ఏం చేయలేవు.
కొవ్వొత్తి కలిగినట్లు కోపం మెల్లిమెల్లిగా కరుగుతుంది.
నరాల మెట్లపై స్వరాలు దొర్లుతున్న తుళ్ళిపడని మొండి మొండాలవి.
వెండి తునకలు పండిన పొలం అది. వెన్నెలలు తప్ప వన్నెలు తరగవు అక్కడ.
గాండీవం విరిగినట్లు ముచ్చట్లు అవి. ముసి ముసి నగవులు కావు.
నమిలి మింగిన చూపుల్ని కళ్ళు పార్థీవదేహాల్లా సందర్శిస్తున్నవి.
కేకలతో ప్రతిధ్వనిస్తున్న దిగంతాలు గుళ్ళ ధ్వజస్తంబాల ముందు గంటళ్ళా వేలాడుతున్నవీ.
ఉప్పొంగే గంగల్లా కుచములు రచించిన వేదాలను రుచిచూసిన పెదాలు ముల్లోకాల్ని పాలిస్తున్నవీ.
మగువా రివ్వున ఎగిరే గువ్వ కాదు ఒక తారాజువ్వ.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి