సాధనా పంచకము :- కొప్పరపు తాయారు
శ్రీ శంకరాచార్య విరచిత 
=======================          


శరీరమువాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షస్సమాశ్రీయతాం
దుస్తర్కాత్స్యు విరమ్యతాం శ్రుతిమత స్తర్కోను సంధీయతాం
బ్రహ్మైవస్మి విభావ్యతా మహరహో గర్వః పరిత్యజ్యతామ్
దేహో హమ్మతి రుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్!

వేదాంత వాక్య విచారము చేయుము. వేదాంత పక్షమును ఆశ్రయించుము. దుష్టమయిన తర్కమును విడిచి వేద విహితమయిన తర్కమును చేయుము. రాత్రిం బవళ్ళు బ్రహ్మను అని భావన చేయుము. గర్వము విడిచి పెట్టుము. శరీరము నందు ఆత్మ బుద్దిని విడిచి పెట్టుము. పండితులతో వాదన చేయకుము. నందు ఆత్మ బుద్దిని విడిచి పెట్టుము. పండితులతో వాదన చేయకుము.
    ,********

కామెంట్‌లు