ఆకాంక్ష :- డా. మంజుప్రీతం కుంటముక్కల మదనపల్లె
సాహితి కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు 
=============
విత్తుగా జననమెత్తి,
మొలకగా మారి,
వృక్షంబుగా కూరి,
ఫలంబుగా నిచ్చి —

జీవిత సారం చెప్పే
నీ మౌన గుణం
ఎంత గొప్పదో…!

విత్తు చిన్నదైనా
వృక్షం పెద్దదని
తెలిపే జీవమా,
నీకు వందనం సుమా…!

రాలే ఆకు,
వాడే పువ్వు —
మరణ సంకేతం
చూపే వృక్షరాజమా,
నీకు జోహార్లు…!

చిగురెత్తి పూసే ఆకు,
తిరిగొచ్చే ఫలం,
ఆశకు సంకేతమై
నిలిచావు నీవు —
అందుకు వందనాలు సుమా…!

ఏ చీకటి,
ఏ వర్షం,
ఏ వెలుగు
చెరచదంటూ,
సుగుణ ధామా,
నీకివే నా అభినందనలు సుమా…!!


కామెంట్‌లు