యోగా..!ఊపిరికి పదునెక్కించేఒక శ్వాస శస్త్రచికిత్స…యోగాతో..!మనసుకు మెరుపులు...జీవనానికి వెలుగులు...యోగా అంటే..?సుదీర్ఘ జీవనానికిసంపూర్ణ ఆరోగ్యానికిసమాజ శాంతికి మార్గంశారీరక మానసిక ఆధ్యాత్మికసమతుల్యతకు మూలస్తంభం...ఉదయ కిరణంలోదాగి ఉంది అఖండ శక్తి...సూర్య నమస్కారాలతోఅందుతుంది ఆదిత్య శక్తి...శ్వాస మీది ధ్యాసతో ఆరోగ్యంచేస్తుంది ఆనందతాండవం...ఆసనాలతో...అంగ సౌష్టవంప్రాణాయామం...పవిత్ర గీతంపద్మాసనంతో...ధ్యాన సౌరభంవృక్షాసనంతో... స్థిత ప్రజ్ఞత...శవాసనంతో...విశ్రాంతి లోకంఅష్టాంగ యోగం...అమృత బాటసమాధి స్థితిలో...వెలుగును ఆత్మ జ్యోతిమనసు మునుగును...శాంతి సాగరంలో...ప్రతి సంవత్సరం యోగా దినోత్సవంమానవాళికి అది ఆరోగ్య సంబరంపతంజలి మార్గం పరమ పావనంయోగ సాధనతో జీవితం సుఖమయం...క్రమ శిక్షణతో రోజు కఠోర సాధన వేస్తేఅది వ్యాధుల తలుపుమూసే మార్గంయోగాతో.....అందే ఆరోగ్యమే స్వర్గం...అంతర్ముఖానుభూతి....యోగ ధ్యానంఆనందపు ఆరుణోదయం...యోగాసనంఅంగాంగ ఆరోగ్య ప్రయోగం వ్యాయామం...బీపీకి షుగర్‌కు...శ్రీ రామ రక్ష...నిర్లక్ష్యానికి నిర్దాక్షిణ్యంగా శిక్ష...సుఖ జీవనానికి యోగా పునాది...ఇదిశరీరానికి క్రమశిక్షణ...ఆరోగ్యపు కిరీటంమనసుకు శాంతి...జీవితానికి మార్గదర్శి.!
యోగాయే నవయుగ మార్గం… - కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి