కారంచేటి అంజలి.వయసు 5 సంవత్సరాలు ఈ చిన్నారికి చిత్రలేఖనమంటే ఇష్టం.
అసలు చిన్నపిల్లలకు చిత్త చాంచల్యం ఎక్కువ కానీ చిన్నారి అంజలికి మాత్రం ఎంత ఓపికో చెప్పలేం.స్థిరత్వం, పనిపట్ల శ్రద్ధ,పట్టుదల,దీక్ష ఎక్కువ. చూస్తే ముచ్చటేస్తుంది.
కరాటే, అధిల్టిక్స్ కూడా నేర్చుకుంటుంది.వాళ్ళ అమ్మ తేజస్వినికి బిడ్డకు ఎన్నో నేర్పించాలన్న ఆలోచన తగ్గట్టు చిన్న అమ్మాయికి కూడా ఉత్సాహం ఎక్కువే.ఏదైనా నేర్చుకోవాలన్న ఆరాటం.పుట్టింది అమెరికాలో.పెరుగుతుంది అక్కడే.తల్లిదండ్రులు తెలుగు వాళ్లు కాబట్టి తెలుగు భాష నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా ఉంది.అమ్మమ్మ సీతాలక్ష్మితో తెలుగు పదాలు నేర్చుకుంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ముచ్చటేస్తుంది.చిన్నారి అంజలికి అభినందనలు,శుభాకాంక్షలు తెలుపుదాం :
----------------
చిట్టి చిత్రకళాకారిణి: - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి