సాయంకాలాన
తటిలో మెరిసే సందె కాంతి మెరుపులన్ని కుమ్మరించి కళ్ల ముందు ఉంచినట్టు ఉన్నావు
ఆస్వాదించే కళ్ళకి అలుపే తెలియట్లేదు
అదేమిటని అడగుదామంటే ధైర్యం చాలట్లేదు
సర్లేనని అడుగేయబోతే పాదం కదలట్లేదు
చూపు తిప్పనివ్వవు
చుట్టూ గమనించనివ్వవు
ఏదో పరధ్యానం, పరాభవానికి దారి తీస్తున్నా పట్టదు
కాలానికి వేసిన సంకెళ్ళని తెంపుకుంటూ
ప్రేమ భాషలో కొత్త దస్తూరి రాయాలని ఉంది
చెక్కిళ్ళ ఎరుపుతో కస్తూరిగా మారాలని ఉంది
మనసంతా బిడియమధనాలతో ఒరుచుకుపోతుంది
ఊరట కలిగేదేపుడో?
...✍🏻నా అంతర్గతం
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి