మానాన్న: సత్యవాణి - కాకినాడ
 మానాన్న రాజ్యాలులేని మహారాజు
పేరు కొండ్రాజు
రాజ్యాలమీద దండయత్రలుచేసి రాజ్యాలను ఆక్రమించలేదాయన
సక్రమమైన నడవడితో
రౌతులపూడి ప్రజల హృదయ సామ్రాజ్యాలను కొల్లగొట్టేడు
అశోకుని కీర్తిలా
దేశమంతా మనాన్నపేరు తెలియకపోవచ్చును
కానీ పాతకరణంగారు
అనిగానీ
కొండ్రాజుగారనిగానీ అంటే ఆనాటి
తూర్పుగోదావరిజిల్లాలోని (పిర్ఖాలుగా)ఈనాడు పిలువబడుతున్న ఎన్నోమండలాలో మానాన్ననెరుగని వారుండరు(ఆనాటి వారుబ్రతికుంటే)
మహరాజు నడిస్తే కాలికింద చీమచావదు
అని అభిమానంతో మాఊరివారు ఆప్యాయంగా కొనియడితే
అబ్బో ఆయన మహాలౌక్యుడు అని
మరికొందరు ఆయనకీర్తి ప్రతిష్టలకు ఈసుతో అనేవారు
ఆయనను ఎవరేమనినా
అనకున్నా
మనాన్న మానాన్నే మనసెరిగిన మహారాజు
ఎంతటి మహారాజుకైనా ఒకటే సింహాసనం
మానాన్న తన ప్రేమానురాగాలతో
తనరౌతులపూడి రాజ్యంలో
ఏర్పరచుకొన్న
హృదయ 
సింహాసనాలెన్నో
ఎన్నెన్నో
          నాన్నపై ప్రేమాభిమానాలతో
          వాణి

కామెంట్‌లు