పిల్లీవచ్చేఎలుకా భధ్రం :- సత్యవాణి

 "పిల్లీవచ్చే ఎలుకా భధ్రం"              
ఒకప్పుడది పిల్లల ఆట
నేడిది పెద్దల ఆట
పెద్దమనుషుల ఆట
రాజకీయ నాయకుల ఆట
రాజకీయ దొంగలతో  వ్యవస్థలాడుతున్న ఆట 
వ్యవస్థలలోని పెద్దలు
"పిల్లీ వచ్చే ఎలుకా!భధ్రం !"అని 
రాజకీయదొంగ పందికొక్కులను హెచ్చరిస్తున్నాయి
దొంగ పందికొక్కులు  తప్పించుకొని పారిపోవడానికి సదవకాశం కల్పిస్తున్నాయి
దొంగ పందికొక్కులు స్థావరలు విడచి నిర్భయంగా
తప్పించుకొంటున్నాయి
వ్యవస్థలు ఆపందికొక్కులను పట్టుకొనుటకు పాట్లు పడుతున్నట్లు అవస్థలు నటిస్తాయి
లక్షలు కోట్ల ప్రజల ముక్కుపిండి వసూలుచేసిన ప్రభుత్వం తనదని భావించే
మన సొమ్మును
దొంగపందికొక్కులను పట్టుకొననడానికి ఖర్చుచేస్తాయి
ఈలోగా ఆ పందికొక్కులు
సురక్షితప్రదేశంలో
కలుగుసామ్రాజ్యం ఏర్పరుచుకొని
బంధుమిత్రులతో గూడిన సుఖవంతమైన జీవన యానం సాగిస్తాయి
'ఇంతేరా మన భారతం 
ఏనాటికి ఇది మారూనురా'
అని మనం పాటపాడు కొంటూ
మరో మారు  మరోమారు
'పిల్లీవచ్చేఎలుకా!భధ్రం' ఆటను  గమనిస్తూనే వుందాంమనం 
తరాలుమారినా
ఆట మారదు
           
కామెంట్‌లు