మనకు నచ్చిన వారితో,మనసుకు నచ్చిన వారితోమనం ఏర్పరచుకునే బంధం"స్నేహబంధం".ఇహంలో అహం లేనిది స్నేహం.పేగుబంధం కాకున్నాప్రాణమిచ్చేది స్నేహబంధం.ధాత్రిపై గొప్పదైనది మైత్రి బంధం.స్నేహం ఎప్పుడైనా, ఎక్కడైనా,ఎవరితోనైనా చేయవచ్చు.చిన్నా, పెద్దా తేడా చూడదు.లింగ బేధం కూడా ఉండదు.కుల, మతాలు కోరుకోదు.జాతి ఖ్యాతి మాట ఉండదు.ఆస్తి, అంతస్తులున్నా అంతరాలుండవు.పేద, ధనిక పొరపచ్చాలు పొడచూపదు.రంగు, హంగు కోరదు.చదువు సాము సాకుచూపదు.పుత్రుడు లేకున్నా మిత్రుడు ఉంటాడు.నేస్తం అందిస్తాడు స్నేహ హస్తం.దోస్తులు నిజమైన ఆస్తులు.సఖుడు మనకు ప్రముఖుడు.సహచరుడు సదా మన అనుచరుడు.ఆప్తుడు మన దీప్తుడు.స్నేహితుడు హితుడుగా ఉండాలి..మంచి చేస్తే ప్రోత్సహించాలి,చెడు చేస్తే తప్పని చెప్పాలి.విజయాలకు అభినందించాలి,ఓటమి వేళ వెన్నుదన్నుగా నిలవాలి.స్ఫూర్తి, స్థైర్యం, ధైర్యం నింపాలి.ఆపద సమయంలో ఆదుకోవాలి.అమ్మా నాన్నలకుఇంట్లో వారికి చెప్పలేనివ్యక్తిగత విషయాలను,మన మిత్రులకు మాత్రమే చెప్పగలం.విరోధం వచ్చినా విడిపోకూడదు.కలుసుకుని కలకాలంకలసిమెలసి ఉండాలి.ఒకరితో మిత్రత్వం చేస్తేతనువున్నంతకాలంశాశ్వతంగా నిలుపుకోవాలి.స్నేహమేరా జీవితం.స్నేహమేరా శాశ్వతం.
స్నేహబంధం :- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ, సారవకోట -9490904976
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి