తెలంగాణ ఆదర్శ పాఠశాల, లింగాల ఘణపురం, మండలం,జనగామ జిల్లాలో పదవ తరగతి చదువుతున్న కె.సాయి ప్రసన్న రచించిన కథ చదువు సంస్కారం బాల చెలిమి జులై నెల సంచికలో ప్రచురితమైనది.ఈ రోజు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జి సునీత గారు ,, ఉపాధ్యాయ బృందం అమ్మాయికి ఆ సంచికనందిస్తూ ముందు ముందు ఇంకా మంచి మంచి కథలు రాయాలని అభినందించారు.చిన్న వయసులోనే మంచి కథ రాసిన కె.సాయి ప్రసన్నను ఉపాధ్యాయులందరూ ప్రశంసలతో ముంచెత్తారు. చదువుతోపాటు రచనలు చేయడం కూడా ఒక అలవాటు.అది భవిష్యత్తులో మనకు రచయితగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
కె.సాయి ప్రసన్నకు ప్రశంసలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి