సాహితీకవికళా పీఠంసాహితీ కెరటాలు=============బరువుతో ముడిపడి ఉండేవే బాధ్యతలు.బాధ్యతల నిర్వహణలోనే అనుభూతులు.మరిచిపోలేని మధురానుభూతులే!గర్భధారణతో తల్లులు మోసే బరువులు!!కుటుంబం నిర్వహణలో తల్లితండ్రుల శ్రమా,జ్ఞానసంపదనొసగే గురువుల అలసటా,మంచి నడవడికకు పెద్దలు చూపే శ్రద్ధా,అన్నీ బాధ్యతలే. బరువులు కావు.ఒకరి బాధ్యతారాహిత్యమే,మరొకరి బరువును పెంచుతుంది.బరువు భారమైన వేళ,బాధ్యతలు మోపే నిర్ణయాలు పుట్టాలి.బాధ్యతలను అప్పగించే ముందు,వారి వారి మానసిక స్థితికి తగ్గట్లు,సామాజిక విలువలను చూపించి,వాస్తవాలను గ్రహించేటట్టు చేయాలి.పంచుకునే బాధ్యతలతో తరిగే బరువూ,బాధ్యతల నిర్వహణలో పెరిగే సంతోషాలూ,తెలియని బద్దకస్తుల మార్పుకి కఠిన నిర్ణయాలతో,సమాజాభివృద్ధికి పాటు పడాలి.భారరహిత స్థితి పిశాచాలదని తెలియజేయాలి.•••••••••••••~•
అనవసర బాధ్యతలే బరువు:- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి