మనసులు తట్టటం
తలపులు లేపటం
విషయాలు వివరించటం
అదేకదా అక్షరాలపని
అందాలు చూపటం
ఆనందము ఇవ్వటం
అంతరంగాలు ఆక్రమించటం
అదేకదా అక్షరాలపని
నిద్ర పుచ్చటం
కలలు రప్పించటం
కల్పనలు చేయించటం
అదేకదా అక్షరాలపని
నోర్లు తెరిపించటం
తేనెచుక్కలు చిమ్మటం
తియ్యదనాలు అందించటం
అదేకదా అక్షరాలపని
పువ్వులు చల్లించటం
పొంకాలు చూపించటం
పరిమళాలు పంచటం
అదేకదా అక్షరాలపని
కనులకు చిత్తరువులుచూపటం
కవ్వింపులకు గురిచేయటం
కుతూహలం కలిగించటం
అదేకదా అక్షరాలపని
నవ్వులు చిందించటం
మోములు వెలిగించటం
మనసులు మురిపించటం
అదేకదా అక్షరాలపని
జాబిలిని ఉదయింపజేయటం
వెన్నెలను వెదజల్లించటం
వినువీధిలో విహారింపజేయటం
అదేకదా అక్షరాలపని
ఇంద్రధనస్సు సృష్టించటం
వివిధవర్ణాలు అద్దటం
అబ్బురం కలిగించటం
అదేకదా అక్షరాలపని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి