స్ఫూర్తిదాతలు...సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 రిటైరైన ఉద్యోగులు తమకివచ్చే పింఛన్ పి.ఎఫ్.భవితకు పిల్లల కోసం దాచుకుంటారు కానీ రాజస్థాన్ కి చెందిన గవర్నమెంట్ డాక్టర్ ఆర్ పి యాదవ్ గ్రామంలోని పిల్లల కోసం ఒక బస్సును కొని చుట్టుపక్కల గ్రామాల ఆడపిల్లలకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు తన పింఛన్ సొమ్ముతో ఆయన ఎంతోమంది విద్యార్థులకు సాయం చేస్తున్నారుకేరళకు చెందిన సురేంద్రన్ సిబిఐ అధికారి ఆయన భార్య టీచర్ వీరు రిటైర్ అయినాక తమకు వచ్చిన కోటి రూపాయల ఖరీదు స్థలాన్ని ఫ్రీగా గాంధీభవన్ కి ఇచ్చారు ఆ సంస్థ అనాధలు అభాగ్యులకు అండదండగా ఉంటుంది వీరు తమ పే న్షన్ డబ్బు కూడా విరాళంగా ఇస్తున్నారుఅహ్మదాబాద్ కు చెందిన పంకజ్ చిమలాల్ రిటైర్ అయిన అధికారి ఆయనకు 30 లక్షల రూపాయల పిఎఫ్ వచ్చింది ఎన్నో ఎన్జీవోల సంస్థల్లో వాలంటీర్ గా పనిచేస్తూ సొంతంగా ఒక బిల్డింగ్ కట్టి 30 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించి మందులు కూడా ఇస్తున్నారు ప్రతిభగల 20 మంది విద్యార్థులకు నెలకు 3000 వారి బ్యాంకు వారి ఖాతాలో జమ చేస్తున్నారు పేద ఆడపిల్లల పెళ్ళికి 50,000 ఇస్తున్నారు ఇప్పటిదాకా 200 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారు తన పెన్షన్ డబ్బుతో🌹
కామెంట్‌లు