అగ్గిపిడుగు అల్లూరి
నిగ్గదీశాడు తెల్లదొరలని
తగ్గముమేమన్నాడు
తరలిపొండి మాదేశం వదలి మీరన్నాడు
బానిసలం కాదన్నడు
మమ్ము తక్కువగాచూస్తే
తుక్కు రేగకొడతామన్నాడు
కప్పము కట్టము మేమన్నాడు
కుప్పలు తెప్పలుగా మాదేశ సంపదను
దొంగల్లా మీరుదోచుకుపోతుంటే
ఒప్పముమేమన్నాడు
ఈ రామరాజు న్నంతవరకూ ఈరాజ్యంలో మీపెత్తనం సాగదన్నాడు
దొరలను గజగజ వణికించాడు
వారి గుండెలు గుబగుబ వుడికించాడు
గుండె చూపాడు ధైర్యంగా కాల్చుకోండని కానీ వెన్ను చూపలేదతడు
తూటాలు ఆ వీరుడి గుండెలుచీల్చాయి
అతడి ధైర్యమేమిటో
పరీక్షిద్దామని
పరీక్షించాయి తూటాలు
పలుక పలుకు లేక నిర్ఘాంతపోయాయి
తన నెత్తురుబొట్లు
కోట్లాది రామరాజులుగా
పుట్టుకొస్తారన్న
అతడి చివరి మాటలలోగల నమ్మకానికి విస్తుపోయాయియవి
అతడి ఆ ధైర్య వచనాలకు
అతడికి తన దేశపౌరులపైగల నమ్మకానికీ
అసలే తెలతెల బోయే
ఆ తెల్లదొరల వెర్రిమొఖాలు
మరింత వెలవెలబోయాయి
అతడిమాటలకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి