-నేటి కోచింగ్ సెంటర్లు:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-హైదరాబాద్.
 మాకెలాగు చదువులేదని
పైసా పైసకూడబెట్టి పుట్టిన పిల్లల భవిష్యత్ బాగుంటుందని
మధ్యతరగతి , పూటగడవని వారు కూడా
నేడు అసత్యపు ప్రకటనలతో
మా బాల్యంలో సినిమా గురించి బండి వాడు మైకులో చెప్పినట్లు
ఆరో క్లాస్ నుంచే ఐ ఐ టి కోచింగ్
ఆ తరువాత అమెరికాకే పయనం
మీ పిల్లల భవిష్యత్ మా కోచింగ్ సెంటర్ ద్వారా ఉజ్వలమని
నేటి ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పినది
అబద్ధమని తెలిసికూడా 
పొరుగింటి వారి పిల్లలతో పోల్చుకుంటు
తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లలో పిల్లలను పెట్టి
ఆడుకునే స్థలంలేక
చెప్పినది తలకెక్కక  చిన్నారులు మానసిక రోగులుగా మారిన సంఘటనలు
విద్యావేత్త గా అనుభవ పూర్వకంగా చెబుతున్న
ఆటలు, పోటీలు, వక్తృత్వాలు ధారణ శక్తిని శరీర ధారుఢ్యాన్నిపెంచును
ఆలోచించే శక్తిని కలుగచేయును
అవి లేక భయంతో క్షణికావేశంలో  పది ఏండ్లకే ఆత్మహత్యలు
కన్నవారి కడుపుకోతలు
ఒక్కసారి ఆలోచించండి
జీవించటానికి చదువొక్కటే కాదు
బాల్యపు మాధుర్యాలుండాలి
చక్కటి సుమతీ వేమన శతకాలు నేర్చుకోవాలి
అప్పుడే అసలయిన భవిష్యత్ ఏర్పడుతుంది
ర్యాంక్ లు ముఖ్యంకాదు
సమాజంలో ఎలా బ్రతకాలన్నదే చెప్పే  విద్యాలయం దేవాలయమే...!!

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం