]ఎప్పుడూ
తడియారని జలమిత్ర వైద్యసేవ
తొడినకొద్దీ వృద్దీ తడితడి గీతం
ఎప్పుడు పారెడు ఏరు వైద్యుడు
రోగుల మనసెరిగిన మనిషి
ఆరోగ్యశక్తి ప్రాణహిత
ఓషధితో మానవతను రంగరించి
వ్యాధులు బాపెడు చికిత్సయజ్ఞంలో
బాధలూ మరిచీ
రోగి ఆరోగ్యమే లక్ష్యంగా ఇల్లు మరిచిన వైద్యులచరిత
చికిత్స చేసే ధన్వంతరి బతుకు
తరాలు మారే స్వరం మారే
మనిషిని మనిషిగ చూసే విద్యలో
ఆటుపోట్లు అధిగమించే హకీం
ఆసుపత్రి గీతంలో తీగ రాగం సవరించి వీణ
ఆనందతీరాలను తృప్తిగ
రోగికి అందించుటే కదా స్వర్గం
వైద్యుడు రోగి వైద్యం బంధం
త్రిభుజ పరిధిలో
త్రికోణమితి
వైద్య సేవలు నిరంతరం సాగే
సుదీర్ఘ కావ్యం
--------------
(నేడు డాక్టర్స్ డే సందర్భంగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి