ఒకానొకరోజు ఓ పాము ఒక మిణుగురు పురుగుని వెంబడించింది. కొంత దూరం వరకూ వెళ్ళిన మిణుగురు పురుగు ఓ చోట ఆగి పాముని ఇలా అడిగింది :
"నేను నిన్ను మూడు ప్రశ్నలు అడగవచ్చా?"
పాము అడగమంది.
"నేను నీ ఆహారానికి సరిపోయే దాననా? అని అడిగింది మిణుగురు పురుగు.
పాము "కాదు" అంది.
"పోనీ నీకేమైనా హాని చేసేనా?" అని అడిగింది మిణుగురు పురుగు.
పాము "లేదు" అంది.
"అయితే మరి నన్నెందుకు మింగాలనుకుంటున్నావు? అని అడిగింది మిణుగురు పురుగు.
అంతట పాము, "నువ్వు క్షణక్షణం మిణుకు మిణుకుమంటూ ప్రకాశించడాన్ని నేను భరించలేకపోతున్నాను. కనుక నిన్ను మింగెస్తాను " అని అంది.
ఈ కథ బుల్లిదే కావచ్చు కానీ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. అదేంటంటే, కొంతమంది ఎవరైనా వృద్ధి చెందితే చూసి తట్టుకోలేరు. అటువంటివారు మిణుగురు పురుగుని మింగేసే పాములా ప్రవర్తిస్తారు. నిశ్శబ్దంగా నాశనం చేయడానికి సిద్ధపడతారు.
ఇది చేదు నిజం.అటువంటి వారి నుంచి దూరంగా ఉండటం మంచిది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి