సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
===============
పసితనాన్ని వీడి,యవ్వనంలో "ఓ ఇంటి వాడై" మురిసె..
ముద్దులొలికే,ముద్దు పాపాయిని చూచి,"తన్మయత్వం" పొందె..
తన బాల్యాన్ని,తనయునిలో ఊహించుకొని,ఉబ్బితబ్బిబ్బయ్యె...
గుర్రమై ఆటలాడి,కోయిలై పాటపాడి,చిలుకై మాటలాడెనుగా...
చిటికెన వేలందించి,ఊతమిచ్చి,చేయూతనందించె..
భుజాలపై ఎక్కించుకొని,లోకరీతి,నీతి నిజాయితీ నేర్పించె..
గురువై బోధించి,"కల్పతరువై" కోరిన కోర్కెలు తీర్చి,సంతృప్తిపొందె..
స్వీయావసరాలు పక్కకు నెట్టి,కొడుకును "యువరాజులా" దూసుకున్నాడు!
తిప్పలు పడి,అప్పులు చేసి,ఉన్నత విద్యావంతుణ్ణి చేసెనులే!
పెళ్లి పీటలపై వున్న,ఇద్దరినీ దీవించి,"హర్షాశ్రువులు" దాచుకొని మురిసె...
వారసుడొస్తే,జన్మధన్యమని భావించి,సంతోషంలో తేలియాడే!
బరువు బాధ్యతలు,ముగిసిన వేళ, "తుఫానే వచ్చింది",ముంచింది...
దినమొక గండమై,ప్రతి క్షణం, పరీక్షలా నిలిచి,"ప్రశ్నించ సాగింది"!
కలలు కల్లలై,కన్నీళ్లు ఏరులై,"జీవితం తలకిందులే" అయింది..
పరువు పోయి,బాధల బరువు,మోయలేనంత భారమై,భరించలేనిదయ్యింది...
దినాలు లెక్కిస్తూ,బతుక లేక,చావ లేక,నిందలకు, జీవితమే కృగింది..
కొత్తను ఆహ్వానించక,పాతను వదలక,ఎన్నాళ్ళో "అంతిమ యానానికై" నిరీక్షణ!
మార్పును స్వాగతించు,సుఖ సంతోషం, "ఒళ్ళో వాలుతుంది"...
పంతాలు,పట్టింపులు మూటగట్టు,"జీవన నావ సాఫీగా సాగుతుంది"..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి