స్ఫూర్తిదాతలు:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 దివ్యాంగులకి మనం ఉపాధి చూపాలి అంతేకానీ వారిపై సానుభూతి చూపరాదు చేతనైతే వారి బాధ నిరుద్యోగం తీరేలా కొన్ని మార్గాలు సూచించాలి అలాంటి స్ఫూర్తిదాత దివ్యాంగుడు వినీత్ సారాయివాలా ఒక సంస్థను 20 20 లో స్థాపించాడు దాని పేరు ఏటిపికల్ అడ్వాంటేజ్ ఇందులో దివ్యాంగులకు రకరకాల ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు వినీత్ అసలు ఎవరీయన అంటే బాల్యంలోనే కంటిచూపు సమస్యతో బాధపడిన ఆయన బెంగుళూరులో ఐఐఎం లో చదివారు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు తన భౌతిక సమస్యను దూరంగా పెట్టి మంచు కొండల్లో సైకిల్ యాత్ర మారుతాన్లలో పాల్గొన్నారు ఈయన రకరకాల మానసిక భౌతిక సమస్యలతో బాధపడే వారికి వారి వారి అభిరుచులకి తగ్గట్లు శిక్షణ ఇప్పిస్తారు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు గూగుల్ అమెజాన్ టెల్ లాంటి సంస్థల్లో దివ్యాంగులు పనిచేయటానికి కారణం వినీత్ అంటే అతిశయోక్తి కాదు డాన్సర్లుగా గాయకులుగా ఆర్టిస్టులుగా ఫోటోగ్రాఫర్లుగా ఎంతోమంది ఈయన ఆధ్వర్యంలో నడిచే ఎటిపికల్ అడ్వాంటేజ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారు.కోయంబత్తూర్ కి చెందిన రఘురాం అనే ఆయన పల్లెలో పిల్లలకు పుస్తకాలు అందించే ఉద్దేశంతో ఆరం అనే ట్రస్టు ప్రారంభించారు స్టడీ మెటీరియల్ ను రిటైర్డ్ టీచర్ల చేత రాయించి ప్రింట్ చేయించి టెన్త్ ఇంటర్ విద్యార్థులకు ఫ్రీగా ఇస్తున్నారు ప్రతి ఏడు ఏడు వెయ్యి మంది విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు బీద పిల్లలకు మ్యూజియం ఫ్యాక్టరీలు మొదలైన వాటికి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పిస్తున్నారుబీహార్ కి చెందిన పోలీస్ అధికారి అజయ్ బహదూర్ సింగ్ నేరస్తుల పిల్లలకు చదువు చెప్తున్నారు తన పని చేస్తున్న పోలీస్ స్టేషన్లో ట్యూషన్స్ చెప్పుతో వారికి ఆటలు పోటీలు కూడా పెడుతున్నారు లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు సాయం చేస్తున్నారు ఈయన నక్సల్స్ ప్రాంతంలో గ్రామాలకి వెళ్లి పిల్లలు పెద్దలు లో గొప్ప మార్పు తీసుకుని వచ్చారురాజస్థాన్ కి చెందిన దేవ్ అమిత్ ఏక్ పహల్ ఇండియా అనే సంస్థతో కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఫీజు ఖర్చు మానసిక ఒత్తిడి లేకుండా చేస్తున్నారు ఆత్మహత్యలు తగ్గాయి ఈయన కోచింగ్ సెంటర్ వల్ల మూడు వేల మంది పైగా లాభం పొందారు అందులో 100 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ముదావ హమ్🌹
కామెంట్‌లు