మనసులు చల్లబడ్డాయి.:- డాక్టర్ సి వసుంధర చెన్నై,
పూర్వకాలం, కాలానికి వాడే పదజాలం చూస్తే తిరుగుతాయి  కళ్ళు గిర్రున
 " సస్యానందం" గ్రంథం తెలుపుతుంది తెలుగు రైతుల
భావజాలం,పదజాలం.  ప్రకృతిలో మార్పుని బహు గొప్పగా. 

దోనయా మాత్యుని  
వర్ష శాస్త్ర గ్రంథం,
సస్యా నందం. లో
 వర్షం రాకడగూర్చి ఇలా. జెండా లాంటి గుడ్డతో  గమనించడం ఆనాటి వర్ష శాస్త్ర విధానం.
 "మానుగాజేష్టమాసము పెంపులోనూ 
యుడుపతి యాషాఢ
యుగముల...."
అంటూ జేష్ట మాస విశేషాన్ని వర్ణించాడు కవి.
 కేరళలోని మలయ పర్వత బహుమానం రుతుపవనాలు.
 మృగశిరతో కాలపురుషుని శిరస్సు చల్లబడుతుంది.
రైతుల మనసు కోడె గిత్తల్లా 
ఏరువాక వైపు పరిగెత్తుతుంది.  

వసుంధర, ధరిస్తుంది 
చిగురాకు పచ్చని నారుమడులచీర.
 పల్లెలకు వరం, సర్వేజనానికి జీవన 
గమనం మృగశిర ఆగమనం. 

ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సౌభాగ్య లక్ష్మి అందరూ ఏకమై వచ్చే ఏకైకకాలం మృగశిర 
శిరసు వంచి మొక్కు దామా మృగశిరకు.

కామెంట్‌లు