వయసుమీద పడుతుంటే వ్యధచెందుట ఎందుకోయి
ఒళ్ళు ఊరి బరువెక్కితె బాధపడుట ఎందుకోయి
శిరోజాలు రాలిపోతె దిగులపడుట ఏలనోయి
బోడిగుండు దాపురిస్తే బెంగపడుట ఎందుకోయి
దంతంబులు ఊడిపోతే చింతించుట ఎందుకనో
చక్కదనము తగ్గినదని కలతపడుట ఎందుకోయి
కనులచూపు మందగిస్తె వెతనుపడుట వల్లదోయి
ఉన్నదాంతొ తృప్తిపడక తపనపడుట ఎందుకోయి
ముక్కులోన పొక్కులున్న క్షోభించుట దండగోయి
మారుమారు తలచుకొనుచు మదనుపడుట ఎందుకోయి
దేహానికి అలసటొస్తె వాపోవుట కూడదోయి
శక్తినంత కూడ్చుకొనక బుగులుపడుట ఎందుకోయి
చెవివినికిడి తగ్గిపోతే రోదించుట ఏమిటోయి
సహజమైన కార్యాలకు శోకించుట ఎందుకోయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి