జీవన సత్యం బోధిస్తాడు!:- కాటేగారు పాండురంగ విఠల్-హైదరాబాద్
సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
==============
ఇంతింతై వటుడింతై చందాన...
తొలి రోజు,కనీ కనిపించక యుండు!
మరు నాటి నుండి,పెరుగుతూ పయనిస్తాడు,
"అంద చందాల మామ,చందమామ!"

పక్షం రోజులకు,"శ్వేత వర్ణంతో" మెరుస్తాడు!
గోళాకారంలో,గోముగా గోచరించి,
"పండు వెన్నెల" కురిపించును!
జగతిని ఆనందంలో ముంచి,మైమరిపిస్తాడు!

మేఘ మాలికలతో దాగుడుమూతలు...
తారలతో సరదాలు,పిల్లలతో దొంగాటలు...
ఆడి_పాడి అందరివాడై, 
అందని మామై,నవ్వి నవ్వించు!

ప్రేమికులను కవ్వించే తుంటరి...
తరుగుతూ...వెలుగు కోల్పోతూ...
మెల మెల్లగా కనుమరుగై,
"కారు చీకటి" కుమ్మరిస్తాడు!
అమావాస్యకు,పున్నమికి వారధి కడుతూ....
"గ్రహ గమనాలను" నిర్దేశిస్తాడు!
కష్టం_సుఖం,లాభం_నష్టం...
వచ్చిపోతాయనే జీవన సత్యం బోధిస్తాడు!


కామెంట్‌లు