విశ్రాంత రికార్డ్ అసిస్టెంట్ మహాపాత్రోకు సన్మానం

 గత ఎనిమిదేళ్లుగా ఈ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ జూన్ ముప్పయ్యో తేదీన పదవీ విరమణ గావించిన రబికుమార్ మహాపాత్రోకు వారి సేవలను కొనియాడుతూ సన్మానించామని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. 
పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సత్కార సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో ముప్పదెనిదేళ్ళ పాటు సేవలనందిస్తూ, తన చివరి మజిలీగా 
గత ఎనిమిదేళ్లుగా ఈ పాఠశాలలో ఘనమైన సేవలనందించీ, పాఠశాల అభివృద్ధికి నాంది పలికారని, విద్యా శాఖకు వన్నె తెచ్చారని ఆయన అభినందించారు. రబికుమార్ మహాపాత్రో, వారి సతీమణి సుజాత కుమారి మహాపాత్రోలను శాలువా, జ్ఞాపిక, పూలమాలలతో పాటు బంగారు ఉంగరాన్ని బహూకరించి, ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సహోపాధ్యాయులు బొమ్మాళి వెంకటరమణ, పెయ్యల రాజశేఖరం, జక్కర వెంకటరావు, పడాల సునీల్, ముదిల శంకరరావు, యెన్ని రామకృష్ణ, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, మాచర్ల గీత, మజ్జి శంకరరావు, వసంత రాజారావు, జి.నరేష్ రామ్ జీ, యందవ నరేంద్ర కుమార్, బోధనేతర సిబ్బంది సుస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు ప్రసంగించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల ఈ పాఠశాలనుండి బదిలీ కాబడిన తూతిక సురేష్, దార జ్యోతి, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్ లు పాల్గొని రబికుమార్ మహాపాత్రో సేవలను ప్రశంసిస్తూ ప్రసంగించారు. రబికుమార్ మహాపాత్రో కుటుంబ సభ్యులైన శ్రీధర్ మహాపాత్రో, మనోజ్ మహాపాత్రో, స్వర్ణలత మహాపాత్రో, సరోజ్ మహా పాత్రో, స్నేహలత మహాపాత్రో, సరిత మహాపాత్రో, శుభశ్రీ, సాత్విక్ మహాపాత్రో, రిత్విక్ మహాపాత్రో, లక్ష్మీప్రియ మహాపాత్రో తదితరులు పలు కానుకలు బహూకరించి, రబికుమార్ మహాపాత్రో సుజాత కుమారి మహాపాత్రో దంపతులను ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు
Popular posts