అనురాగ ఆప్యాయతల మధ్య
జన్మనిచ్చిన తల్లిదండ్రుల పెంపకంలో ఆనందమే
నవ యవ్వనపు దశలో ప్రకృతి సోయగాల
పండు వెన్నెల మధ్య నిను ప్రేమించే
ప్రేయసి మాటలు ఆనందమే
వివాహాబంధంతో ఒక్కటై అలుమగల విడరాని బంధం ఆనందమే.
కష్ట సుఖాలలో నేనున్నాన్న స్నేహబంధం మరపురాని మధురబంధం.
వృద్దాప్య సమయాన ఎన్ని వ్యథలున్న
మనిషిగా పుట్టిన తరువాత
బాల్య, యవ్వన, కౌమార దశలను జ్ఞప్తికి తెచ్చుకుని
నలుగురి తో కలసి
జాతస్యహి ధృవో మృత్యు: అని
అది శాపం కాదని
సంతోషంగా జీవించిన వారి జీవితం సాఫల్యమేయగు....!
..............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి