అమ్మ చెప్పిన పాఠాలు:- --గద్వాల సోమన్న, 9966414580
అద్దంలా  ఉండాలి
నీడలా మారాలి
ఏ బంధమైననూ
మేడలా కావాలి

పాటలా సాగాలి
తోట మేలు చేయాలి
కోట వోలె ఉంటూ
మాట విలువ పెంచాలి

కలం చేత పట్టాలి
ప్రజల భుజం తట్టాలి
జలంలా మారిపోయి
గొంతు కాస్త తడపాలి

కన్నోళ్లను చూడాలి
దైవాన్ని వేడాలి
ధైర్యాన్ని పెంచుకుని
పిరికితనం వీడాలి


కామెంట్‌లు