ముగ్గులపోటి:- భౌగోళ్ల శ్రీపూజ -7వ,తరగతి -జిపఉపా:బక్రిచెప్యాల-జిల్లా:సిద్దిపేట -9704865816

 ముండ్రాయి గ్రామంలో లత అనే అమ్మాయి ఉండేది.తనకు చదువుతోపాటు, ఆట,పాట, ముగ్గులు వేయడం కూడా రాదు.లత వాళ్ళ ఇంటిముందు సోని అనే అమ్మాయి ఉండేది.తాను,లత ఒకటే తరగతి.సోని మాత్రం అన్నింటిలో ఫస్ట్.వాళ్ళ స్కూల్లో ఎటువంటి పోటీలు నిర్వహించిన అన్నిటింలో సోనే గెలిచేది.సోని ఎప్పుడు లతను చదువురాని మొద్దు అని వెక్కిరించేది.సోనితోపాటు బడిలో పిల్లలు కూడ ఆమెను వెక్కిరించేవారు.ఈ విషయం అంత క్లాస్ టీచర్ రమా మేడం గుర్తించింది.లత అనే అమ్మాయిని ఎలాగైనా అన్నింటిలో ముందుండేలా తయారు చేయాలని కంకణం కట్టుకుంది.లతని పిలిపించి నువ్వు బడి అయిపోయినంక మా ఇంటికి రా!నేను నీకు అన్ని దగ్గరుండి నేర్పిస్తాను. మేడం అనగానే 
లతకు చాలా సంతోషం అయింది.ఆ రోజు నుంచి రమా మేడం వాళ్ళ ఇంటికి వెళ్లి చదువుతో పాటు,పాటలు,ముగ్గులు నేర్చుకునేది.
సంక్రాంతి పండుగ రానే వచ్చింది.ఆ ఊరి ఉద్యోగుల సంఘం వాళ్ళు ప్రతి సంక్రాంతి పండుగ భోగినాడు బడిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు.అందులో గెలిచిన వాళ్లకు వెండి బహుమతులు ఇస్తారు.ఈ సంవత్సరం కూడా ఆ ఊరిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.అది విని సోని వాళ్ళ మిత్రులు ఎప్పటిలాగా మనం కూడా ముగ్గులు వేద్దామని అనుకున్నారు. అప్పుడు అందరు లతా నువ్వు కూడా ముగ్గులు వేస్తావా అని వెక్కిరించారు. అది చూసిన రమా మేడం సోనిని మిగతా పిల్లలను కోప్పడింది.తోటి స్నేహితురాలిని వెక్కిరించడం మంచిదా చెప్పండి అని అనగానే అందరూ నిశ్శబ్దం పాటించారు.అయితే మరుసటి రోజు ముగ్గుల పోటీ ప్రారంభమైంది.లత,సోనీ ఇంకా కొద్ది మంది పిల్లలు ముగ్గులు చక్కగా వేశారు. అందులో లత ముగ్గు బాగుండడంతో లత ప్రథమ బహుమతి వెండి గిన్నె గెలుచుకోవడం జరిగింది. సోనికి ద్వితీయ బహుమతి వచ్చింది.అది చూసి సోనిని మిగతా మిత్రులు వెక్కిరించారు.సోని ఈ అవమానాన్ని తట్టుకోలేక పోతుంది.ఎప్పుడు కూడా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని.ఈసారి సెకండ్ రావడం ఏంటిదని బాగా ఆలోచించింది.అప్పుడు రమా మేడం ఊరుకో సోని నువ్వైతే ఏంటి లత అయితే ఏంటి.ఎవరో ఒకరే గెలవాల్సింది.ఇప్పుడు లత గెలిచింది.లత వెళ్లి రమాదేవి మేడం గారికి ధన్యవాదాలు తెలిపింది.మీరు ఇంటి వద్ద నేర్పించకపోతే గెలిచేదాన్ని కాదు అంటుంది. అప్పుడు సోని కూడ రమాదేవి మేడం వాళ్ల ఇంటికి వెళ్లి చదువుకుంటానని అంటుంది. రమా మేడం ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లి మంచి విద్యాబోధనతోపాటు లోకజ్ఞానం నేర్పింది. ఇద్దరు కూడా గొప్ప ప్రయోజకులు అయ్యారు.
 

కామెంట్‌లు