తమ్మునికి సలహాలు:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
మంచి మంచి తలపులతో
గొప్ప గొప్ప చేతలతో
అందరిని మెప్పించాలి
అంతులేని జ్ఞానంతో

ఊరడించు మాటలతో
ప్రేమలొలుకు హృదయంతో
గుండెల్లో చేరాలి
అభిమానం పొందాలి

ఘనమైన మేధస్సుతో
ఘనులైన వ్యక్తులతో
జీవితాన వెలగాలి
స్నేహమే వికసించాలి

చాడీలు చెప్పకుండా
ప్రేమతో మదినిండా
ఎగరేయాలి తమ్ముడు
ఇల త్రివర్ణ జెండా


కామెంట్‌లు