నాకు మూడున్నర సంవత్సరాలు
మా ఊరిలో నా తోటి పిల్లలంతా
టై బెల్ట్ షూ వేసుకొని బసెక్కి
ప్రయివేట్ (కాన్వెంట్ ) బడికి పోతున్నారు.
నాకు వెళ్లాలని ఉంది, కానీ
మా ఇంట్లో ఆ తాహాతు లేదు
ఊరి బడికి పోదామంటేనేమో
నాకు ఐదున్నర సంవత్సరాలు ఉంటేనే బడిలో చేర్చుకుంటారoట
చదువు చదువుకోవడానికి పిల్లల వయసులో
అంతరాలెమిటో నాకేమీ అర్ధం కావడం లేదు
"నేనేం "
కాన్వెంట్ బడిలో విషయానికొక ఉపాధ్యాయుడంట, ఇంకా ఆటలు
డ్రాయింగ్ మ్యూజిక్ కూడా అదనపు ఉపాధ్యాయులంట
మా ఊరి బడిలో అన్ని తరగతులకు కలిపి
పదిమంది కొక ఉపాధ్యాయుడంట.
అతడే అన్ని తరగతులకు అన్ని విషయాలు బోధిస్తాడట "నేనేం "
జనాభా లెక్కలు, కాంప్లెక్స్ మీటింగ్స్, ఎన్నికల డ్యూటీస్,
మిడ్డెమీల్స్ బిల్స్, ఇతర ప్రభుత్వ మీటింగ్స్ అన్ని తానై ఉంటాడు ,
మిగిలిన.... కాలంలో పిల్లలకు బోధన కానిస్తాడట "నేనేం"
ఎలానో ఒలాగా ప్రాథమిక విద్య పూర్తి చేసుకుంటే .
మాధ్యమిక ఉన్నత విద్యకోసం
నేను ఉన్నత పాఠశాలలో చేరాననుకో
అక్కడ నాకు బోధించే విషయాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం
తెలుగు హింది,ఇంగ్లీష్ మాథ్స్ సైన్స్, సోషల్, ఆటలు ఇతరములు
ఈ బోధనే విద్యార్ధి సంపూర్ణ వికాసానికి ఆధారాలు
కానీ.....
మా ఊరిలో ప్రైవేట్, కాన్వెంట్ లో
చదివే పిల్లలకు మాత్రం ఐఐటీ పేరుతో మ్యాథ్స్ సైన్స్ తప్ప
మిగతావేవి బోధించరట. "నేనేం"
IIT NEET ల లో సీట్స్ సాధించ్చాలానే కోరిక తో
శక్తి ఉన్నా లేకున్నా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించే తల్లి దండ్రులెందరో
కళాశాలలు పిల్లలను ఫిల్టర్ చేయడం కోసం పెట్టే పరీక్షలెన్నో
ఆ పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక
మానసిక రోగులుగా మారుతూ తమను తాము నశింప చేసుకునే భావి పౌరులెందరో
అలా అయితే నైతిక, మానవత్వపు విలువలు, సమాజ పోకడలు తెలిసేదెట్లా! " నేనేం "
నీట్ ఐఐటీలు చదివిన వారికి ఉన్నతోద్యోగాలు, గొప్ప జీతాలు వస్తున్నాయట.
కానీ...... వారు సమాజం లో ఇమడలేక , సంసారమనే సాగరం ను ఈద లేక,
శారీరక మానసిక రోగాలను కొని తెచ్చుకుంటున్నారట.
కానీ..... \ మా ప్రభుత్వ పాఠశాలలోచదివిన పిల్లలెందరో
ఉన్నత చదువులు ఉన్నతోద్యోగాలు రాకపోయినా, చేయక పోయినా
చేసె పని వద్ద అందరితో మంచి మర్యాదతో
కలగలసి పోతున్నారట, ఆరోగ్యంగా ఉంటున్నారట. "నేనేం "
నీట్ ఐఐటీ చదువులు చదవాలనే పేద విద్యార్థులకు
ఈ విద్య అందని ద్రాక్షేనా....
ఈ అంతరాల విద్యను, ప్రవేశ పెట్టి కొందరికె అందేటట్టు చేస్తూ,
ఏమీ తెలియనట్టు నటిస్తున్నవి ఈ ప్రభుత్వాలు.
ఇలానే చూస్తూ కూర్చుంటే
రాబోవు కాలాల్లో సమాజం
రెండు ముక్కలు గా విడిపోవడం తథ్యం .
చదువొస్తుంటే ఉన్న మతి పోయినట్లు
నటిస్తున్నరు పాలకులు " నేనేం "
ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరచి
తేరిపారా చూడాలి.
అందరికి అంతరాలు లేని సమానమైన నాణ్యమైన విద్యను అందించి,
అంతరాలు లేని సమాజంకోసం పాటుపడాలి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి