సాహిత్యమనేది సామాజిక స్పృహకు ప్రతిరూపం
 
సాహిత్యం అనే కళ సామాజిక స్పృహకు ప్రతిరూపమని, మానవాళి జీవన శైలికి ప్రతిబింబమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెద్దిన కులశేఖర ఆల్వార్ అన్నారు.కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఏడో నెల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనంతో పాటు, పదోతరగతికి సంబంధించిన తెలుగు స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఉచితంగా విద్యార్థులకు బహూకరించారు.
వేదిక కార్యవర్గ సభ్యులు ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్ రూపొందించిన తెలుగు స్టడీ మెటీరియల్ పుస్తకాన్ని ఈనాటి కార్యక్రమంలో తొలుత కులశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం మెట్టూరు, నివగాం, కడుము, కొత్తూరు విజ్ఞాన భారతి, కొత్తూరు మహర్షి, కొత్తూరు రాజ్ శ్రీనివాస్, కొత్తూరు హోలీ క్రాస్ ఉన్నత పాఠశాలల పదోతరగతి విద్యార్థులైన బి.జ్ఞానేష్, ఎస్.నాగరోహిత్, లకినాన శరణ్య,  కె.గీతిక, సి.హెచ్.జితేంద్ర, జి.అఖిల్, డి.రితిక్ లకు ఈ పుస్తకాలను బహూకరించారు. పుస్తక రూపకర్త దిలీప్ పట్నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలకూ చేర్చే ఆలోచనలో భాగంగా, ఈ తెలుగు పుస్తకాలను బహూకరించామని, తెలుగులో వెనుకబడిన విద్యార్ధులకు ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకరమని అన్నారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు, కార్యవర్గ సభ్యులు ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్, బాణాన రమణమూర్తి, గజిబిల్లి మోహనరావు, బలగ నాగేశ్వరరావులు తమ కవితా గానం వినిపించారు. ఈ కార్యక్రమంలో లకినాన నరసింహ మూర్తి, బొమ్మాళి ప్రసాద్, అల్లు మోహన్ తదితరులు పాల్గొన్నారు. మిఠాయి పంపిణి చేసారు .

కామెంట్‌లు