కర్తవ్యమే పరమావధిగా
కార్యోన్ముఖులై మార్గం లో
అవరోధాలు ఎదురైనా
ఆదరక బెదరక
శతృదేశమైన పాకిస్తాన్ కుటిలనీతిని ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని చేకూర్చి
దేశరక్షణకు కారణమైన సైనికులు
ప్రజల ఆకలి తీర్చే కర్షకులు
దేశానికే వెన్నుముక అని
' జై జవాన్ జైకిసాన్' అనే నినాదంతో ప్రజలను చైతన్య పరచి
పొట్టి వారైనా గట్టివారే అని
భరతావని కే గాక ప్రపంచానికే తెలియచేసిన
మహనీయులు భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీజీ
మీరు నిష్కళంక,నిరూపమాన
దేశభక్తులు....!!
నెహ్రూజీ మంత్రి వర్గంలో
రైల్వే శాఖ మంత్రిగా ఉండి
రైలు ప్రమాద సంఘటనకు
బాధ్యత వహించి కేంద్రమంత్రి పదవిని త్యాగం చేసిన త్యాగశీలురు.
స్వంత వాహనం లేని ప్రధాని గా
మానవత్వమే మాధవత్వమని
ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసి
పదవికే వన్నె తెచ్చిన
శాస్త్రీజీ అందుకోండి మీకివే
ముప్పది ఐదుకోట్ల భారతీయుల వందనములు...!!
............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి