పల్లవి::
పాలిని!పావని!శూలిణి!లోకేశ్వరి!జగన్మాత!
పారణ ప్రియముగ చేసితి!గైకొనవే శ్రీమాత!
పాపపుణ్యమెరుగనైతి!దయజూడవె చిద్రూప!
పామరినని కరుణించవె దోషములను రూపుమాప.
"పాలిని"
చరణం::
మానస విరి వనములోని భక్తిపూలనేరితెచ్చి
మాధవి! నిను కొలచితిని శ్రీలక్ష్మిగ సేవించి
మాలిని! నిను కీర్తించగ! ఎద కదిలిన పదములనే
మాలికగా చేసితిని శ్రీ దేవత!గాయత్రీ!
చరణం::
అఖిల జనుల ఆర్తి బాపి అన్నమొసగు అన్నపూర్ణ
అవని హృదయ రాగదీప్తి! నీవేలే! శ్రీపూర్ణ!
అలల సడుల నడుమ విరియు కమలాసని!శ్రీ లలితా!
అపరాజిత నీవమ్మా!విజయేశ్వరి వరదాతా!
"పాలిని"
చరణం::
చిరు చిరు నగవులతో,సిరిమువ్వల సవ్వడితో
చిత్తమందు నిలచితివే శ్రీ బాలా త్రిపుర సుందరి!
చిన్మయ రూపిణివే శ్రీ జ్ఞాన సరస్వతీ!
చిరకాలము వెలుగునిచ్చు సాహితివే శ్రీ భారతి!
"పాలిని"
చరణం:::
రాజరాజ రాజేశ్వరి! శ్రీదుర్గా మాతేశ్వరి!
రాజిత! రాగిణి!రూపిణి!రాగమయీ!శ్రీ నందిని!
రాజ్ఞివి!శక్తివి!నీవని!మహిషాసురమర్ధనివని!
రాగమెత్తి పాడితిని! నవరాత్రులు అర్చించి .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి