ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి అక్టోబర్ ఏడున తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ నందు జరుగు పోరాటాన్ని జయప్రదం చేయాలని వారన్నారు. ఈ మేరకు కొత్తూరు మండల ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం నుండి అంబేద్కర్ కూడలి వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వ ఏర్పడి పదహారు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని, ఇంతవరకు 12వ పిఆర్సీ నిమిత్తం కనీసం కమిటీని కూడా నియమించలేదని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. పీఆర్సీ అమలులోకి వచ్చినంత వరకూ మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు డీఎలనూ విడుదల చేయాలని, సిపియస్ ను రద్దు చేయాలని, బకాయిపడ్డ ఇతరత్రా ఎరియర్స్ ను చెల్లించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో నాయకులు దండు ప్రకాష్ రావు,
కె.శాంతారామ్, కె.విజయకుమార్, వి.మధుసూదనరావు, ఆర్.ఆర్.ఎం.కొండలరావు తదితరులు తెలిపారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈనెల ఏడో తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని జరిపి తీరుతామని అన్నారు. ఈ బైక్ ర్యాలీలో ఎల్.గోవర్ధనరావు, గౌరీశంకర్, పి.బాలరాజు, టి.రవి, ఎం
లోకేష్, చంద్రమౌళి, రమణమూర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి