కెనడా లో ఫామ్ ల్యాండ్స్ సందర్శన : టి. రాజేంద్ర ప్రసాద్ , విశ్రాంత ఉపాధ్యాయుడు , కరీంనగర్




 ఇక్కడ పిల్లలకు పెంపుడు జంతువులు మినహా ఇతర జంతువులు , ప్రాణుల విషయం లో అవగాహన కలిగించడానికి ఫామ్ ల్యాండ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వారాంతపు సెలవుల్లో పిల్లలను తీసుకు రావడానికి ఇష్టపడతారు. ఫామ్ ల్యాండ్స్ లో వివిధ పంటలతో పాటు కుందేళ్లు , జింకలు, మేకలు , గొర్రెలు, పందులు, కోళ్లు, నెమళ్లతో పాటు ఇతర పక్షులు, జంతువులు ఉంటాయి. ఇక్కడ టిక్కెట్ తీసుకుని రోజంతా గరిపే అవకాశం ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో జీవకారుణ్యం పై అవగాహన పెరుగుతుంది. తమ పుస్తకాల్లో వుండే జంతువులు, పక్షులను స్వయంగా చూసి ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. అదే కాకుండా పంటలు ఎలా పండుతాయి. దానికి రైతులు ఎంత కష్ట పడతారో తెలుస్తుంది. అందుకే అక్కడ ఉపాధ్యాయులు కూడా పిల్లలను ఫామ్ ల్యాండ్స్కు తీసుకు వెళ్ళమని తల్లి దండ్రులకు సిఫార్సు చేస్తారు. ఇలా మేమూ ఒక రోజు అక్కడ గడిపి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇలాంటి అవకాశాలు మన దేశం లో కూడా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. 
కామెంట్‌లు