దుర్గా శతకపద్యాలు:- డి.వినాయక్ రావు , భైంసా , 9440749686
 11 సిద్ధించగ పనులన్నిన్
తద్దెను పలికించు సిద్ధిదాత్రిగ మాతో 
ముద్దగు రూపము నీదిన్
గద్దెన నవమందుజూడ ఘనమది దుర్గా !
12 విజయ దశమి దిన మందున్
విజయాలనొసంగ వచ్చు వేల్పువునీవే 
ప్రజలందరు గొలుతురునిను 
భజనలు చేయంగనిన్ను భక్తిగ దుర్గా !
13 కాలస్వరూపిణివమ్మా
కాలుడునీమాటవింటు కదులుచు నుండన్ 
కాలము మముశాసించన్ 
పాలన జేయంగరమ్ము పాలక దుర్గా!
14 శక్తివి నీవేనమ్మా 
భుక్తము నీరూపమగు విభూతిన్నొసగన్ 
రక్తము నీవేనమ్మా
శక్తిగ కలిలంబు నడుపు సత్వము దుర్గా!
15 రక్కసులవిమనమందున
చక్కని స్థావరమనంటు చాటుగనుండన్ 
మక్కువ మరిచెడి ప్రాణుల 
దిక్కుగ నిలుచుండ వచ్చు దేవత దుర్గా!
16 హేరము నీకిష్టంబని 
నీరముతో ముద్దజేసి నిను పూజించన్ 
వారిజలోచన పూజకు 
సారథి నీవయ్యి యిచ్చు సంబ్రము దుర్గా!
17 లోకుల కష్టాలన్నియు 
శాకములా తిందువమ్మ  శాకాంబరివై 
నీకడ శాకములెట్టియు 
నీ కాయమలంకరింత్రు నిక్కము దుర్గా!
18 లలితమ్మవు నీవేగా 
యిలలో నీనామజపము యిష్టము తీర్చున్
తలచిన పనులన్ని జయము 
పిలవగనే చేస్తవంట ప్రీతిగ దుర్గా!
19 దేవీ భాగవతంబున్ 
దీవెన లొసగంటు చదువు దీక్షను బూనిన్ 
భావము కథలవి నీదు ప్ర
భావము చూపించి ప్రభవ ప్రాప్తగు దుర్గా!
20 దీపము వెల్గును తల్లీ 
మాపాలిటి దైవమంటు మనుషులు గొలచన్ 
కాపాలిగ నీవిల మా
తాపాలను తీర్చవమ్మ ధాత్రిగ దుర్గా! 

కామెంట్‌లు