అమ్మమ్మ గారి బాదం చెట్టు: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.-9963265762.
అరవై ఏళ్ళయి చూస్తున్న

అమలాపురంలో అమ్మమ్మగారింటి
ఆ బాదం చెట్టు మాపాలిట కల్పవృక్షమే.

అరుణక్క ,నేను అత్తయ్య పిల్లలు
ఆడుకునే ఆచెట్టు కింద  పడిన బాదం కాయలకోసం కొట్లాటలు

ఆచెట్టు కింద జరిపిన బొమ్మల పెళ్ళిళ్ళు
ఉడుతలు చేసే  చిరు సవ్వడులు
పిచ్చుకల కిచ కీచా రావాలు
వేసవిలో మీసాల తాతయ్య నులకమంచం మీద కూర్చుని చెప్పే
చందమామ కథలు.

పండిన ఆకులు రాలి మరల చిగురించి
ఆహ్లాదాన్ని  కలిగించిన 
ఆ బాదం చెట్టు నేడు బహుళ అంతస్తుల కొరకై
మామయ్య పిల్లలు ఇచ్చేస్తే
అమెరికా నుంచి వచ్చిన నేను అమలాపురంలో ఉన్నానా అని
అమ్మమ్మ,తాతయ్య, నాన్న, అమ్మలా  జ్ఞాపకాల పుటల్లోకి  చేరిపోయింది అనుకున్నా....!!
............................

కామెంట్‌లు