ఆస్వాదించు! మట్టి పరిమళం:- -బాలబంధు గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580
మట్టితో మానవునికి
అంతులేని అనుబంధము
దైనందిన జీవితాన
గోచరించు ఈ సత్యము

అన్నదాతకు అనుభవము
ఈ ఘన మట్టి పరిమళము
హలముతో పొలాలు దున్ని
పెట్టును కడుపుకు అన్నము

మట్టిలోనే ఆటలు
ఆడుతారు చిన్నారులు
విడదీయ రాని బంధము
దానిలోనే మమేకము

మట్టి మర్మమే గొప్పది
తెలుసుకుంటే మంచిది
మట్టిలో కలిసే వరకు
అదే అమ్మ ఒడి మనకు

మట్టిలో మాణిక్యాలు
అమూల్యమైన ఖనిజాలు
దొరుకు స్థలం అదే అదే
గమనించుము పదే పదే

మట్టికుంది ప్రాముఖ్యత
గుర్తుపెట్టుకో అంచేత
మట్టి పరిమళం గురించి
తెలుసుకొమ్ము దాని మంచి


కామెంట్‌లు