స్నానం సబ్బు:- - యామిజాల జగదీశ్
 "స్నానం సబ్బు" వాడకం విషయానికి వస్తే ఈనాడు అనేకానేక బ్రాండ్లు ఉండవచ్చు. కానీ పంతొమ్మిది వందల అరవైలలో లేదా యాభైల ప్రారంభంలో పూర్వపు మద్రాస్ మార్కెట్లో అవి చాలా తక్కువ. అప్పట్లో ప్రధానమైనవి, హమామ్, లక్స్, బిగ్ రెడ్ లైఫ్‌బాయ్.
లైఫ్‌బాయ్‌ సబ్బుని హిందూస్తాన్ లివర్ లిమిటెడ్ తయారు చేసింది. (తరువాత అది హిందూస్తాన్ అన్‌లివర్ లిమిటెడ్‌గా మారింది). HLL 1956లో స్థాపితమైంది. ఈ సబ్బు భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది 
కార్బోలిక్ వాసన, సాధారణ ఎరుపు రంగు, మంచి ధర కలిగిన సబ్బు. 
మార్కెట్‌లోఎక్కడంటే అక్కడ కనిపించేవి.  ఈ సబ్బు పెద్ద సైజు కావడంతో పురుషులలో బాగా ప్రాచుర్యం పొందింది.
లైఫ్‌బాయ్ ఉన్నచోట ఆరోగ్యం ఉంటుంది అనే వారి ప్రసిద్ధ ప్రకటన చాలా ఆకర్షణీయంగా ఉండేది. అది సబ్బుకు సంబంధించిన నినాదం. ఇటువంటి నినాదాలతో ఇతర తయారీదారులు కూడా మార్కెట్లోకి వచ్చేలా చేసింది. ఆకర్షణీయమైన మాటలు కోసం ఆలోచించేవారు. 
మొదటి లైఫ్‌బాయ్ సబ్బు 1895లో ఒక కంటైనర్‌లో బొంబాయి హార్బర్‌లో వచ్చింది. 
నిజానికి ఎనభైల ప్రారంభంలో నేమ్ లైఫ్‌బాయ్ అనే నకిలీ సబ్బు మార్కెట్లోకి వచ్చింది కానీ అనతికాలంలోనే అది అడ్రెస్ లేకుండా పోయింది. 
ఈనాడు లైఫ్‌బాయ్సబ్బు రూ. పదికి నమూనా సబ్బుగా అందుబాటులో ఉంది. 
ఇది ఎక్కువగా హోటళ్ళు, లాడ్జీలలో ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రదర్శించిన ప్రకటన 1954 జూన్ నెలలో "కలైమగల్‌" అనే మ్యాగజైన్లో కనిపించింది.

కామెంట్‌లు