ధాత్రి గర్భంలో మొలక : - నాగలక్ష్మి కుంజా- తెలంగాణ సాహితీ భద్రాచలం శాఖ.
 తొలి కోడి కూత వినగానే 
      పొలానికి పయనమయ్యే రైతన్నలు 
తొలిపొద్దు నుదుట సింధూరమై భాస్కరుడే తట్టే 
       సమయంతో పయనమయ్యే కిరణాలు 
హర్షకులు హలాలతో పొలాలు అన్ని దున్ని 
             ధాత్రి జగత్తులో విత్తు అల్లల్లన విత్తనాలు నాటే 
ఆనందంతో మేఘం మనసు మెల్లగా కరిగి కదిలే
      బొట్టు బొట్టు నా చినుకులు చిటపట వర్షం కురిసే 
ఊపిరి పీల్చిన ధాత్రి మట్టి పరిమళాలను వెదజల్లే 
        కమ్మని వాసన ప్రకృతి గుండెల నిండా పీల్చే 
గడుస్తున్న కాలంతో ధాత్రి గర్భం దాల్చే 
    ధాత్రిని చీల్చుకునీ పోరాడుతూ పుట్టిన విత్తనమే 
ధాత్రి గర్భంలో పచ్చని మొలక పురుడుసుకొని 
      పచ్చని మొలక ముగ్ద మనోహరమై 
పిల్లగాలులతో పచ్చని పైరు ఊగిసలాడుతూ కనులవిందుగా పైరు గుసగుసలాడే 
ప్రకృతి మైమరచి సరిగమలతో నాట్యం ఆడే 
   ధాత్రి గర్భంలో మొలకను పుట్టేటప్పుడు పచ్చదనాన్ని ముద్దాడుతూ
ధాత్రి గర్భంలో గిట్టేటప్పుడు కూడా అక్కున చేర్చే 
      సుగుణం ఎంత గొప్పది 
 పుడమి లేకుంటే మనకు జగత్తు లేదు 
     నేలతల్లి లేకుంటే ఆయువు ప్రాణ వాయువు లేదు అవని అమ్మ లేకుంటే సృష్టికి జీవమే లేదు 
    ధాత్రి జగత్తులో కోట్ల  జీవాల పుట్టుక ఎక్కడిది?
ఈ మట్టి, పుట్టి ,గిట్టి కాలగర్భంలోనే తట్టే గొప్ప చరిత్ర.
                                 
   

కామెంట్‌లు