నేషనల్ షూటింగ్ బాల్ ట్రోనీలో ఇందు⚽: వెంకట్, మొలక ప్రతినిధి

 జాతీయ స్థాయి సీనియర్ మహిళల షూటింగ్ బాల్ ట్రోనీలో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం (ఐనేల్లి)  కె.జి.బి.వి తాండూరు కి చెందిన విద్యార్థిని ఇందు ఎంపికైంది.జనవరి17,18 తేదీలలో వికారాబాద్ జిల్ల తాండూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళా షూటింగ్ బాల్ పోటీలో పాల్గొని ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు విద్యార్థిని తల్లిదండ్రులు మరోనీ భాయ్, రాజు తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు తిరుపతిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అశలత , పిఈటి బాలమణి అభినందిస్తూ ప్రోత్సహించారు . 
కామెంట్‌లు