వికారాబాద్ కలెక్టరేట్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న చిన్నారుల రోల్ ప్లే: వెంకట్, మొలక ప్రతినిధి

 వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆలోక జాయ్ స్కూల్, వికారాబాద్‌కు చెందిన చిన్నారులు ప్రదర్శించిన స్వాతంత్ర ఉద్యమం  లో రోల్ ప్లే అందరినీ ఆకట్టుకుంది.4వ తరగతి విద్యార్థిని అన్షు శ్రీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించగా, 5వ తరగతి విద్యార్థి శివరాజ వర్ధన్ బ్రిటిష్ కలెక్టర్ రూథార్డ్ ఫార్డ్ పాత్రను పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఎంతో హృద్యంగా ప్రదర్శించారు.ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహ మేడం ప్రశంసించారు. చిన్నారుల ప్రతిభను మెచ్చిన కలెక్టర్  గారు మెమొంటోతో సత్కరించారు.ఇద్దరు చిన్నారులు అన్న చెల్లి కావడం విశేషం .. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రూపొందించిన ప్రిన్సిపల్ గీత  జోషి పిల్లలకు సహకరించిన ఎం. రాజేశ్వరి, దిలీప్ కుమార్ షిండే తల్లిదండ్రులను ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.
కామెంట్‌లు